Chiranjeevi: మెగాస్టార్ ‘విశ్వంభర’ సినిమాకు ఓటీటీ సమస్య!

by Hamsa |
Chiranjeevi: మెగాస్టార్ ‘విశ్వంభర’ సినిమాకు ఓటీటీ సమస్య!
X

దిశ, సినిమా: ప్రస్తుతం సినిమాలకు థియేట్రికల్‌ హక్కుల బిజినెస్‌తో సమానంగా జరుగుతుంది ఓటీటీ వ్యాపారం. ఓ సినిమా నిర్మాణంలో ఖర్చుపెట్టిన వ్యయంలో దాదాపు అరవై శాతం పైగా ఓటీటీ హక్కుల రూపంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇది ఆ సినిమాలో నటీనటులు, దర్శకుడు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. చిన్న సినిమాల ఓటీటీ హక్కులు తీసుకోవడంలో కాస్త బెట్టు చేసినా ఓటీటీ సంస్థలు ముఖ్యంగా అగ్రతారలు నటించే సినిమాల హక్కులు కొనడంలో పోటీ పడుతుంటాయి. అయితే ఇప్పుడు అగ్రతారల విషయంలో కూడా హక్కులను కొనే ధర విషయంలో ఓటీటీ సంస్థలు అచితూచి అడుగులేస్తున్నాయట.

ఇప్పుడు విశ్వంభర ఓటీటీ హక్కుల విషయంలో నిర్మాతలు కోట్‌ చేసిన అమౌంట్‌ను ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమా నిర్మాణ వ్యయం పెరగడంతో విశ్వంభర హక్కుల కోసం పోటీపడుతున్న ఓటీటీ సంస్థలకు నిర్మాతలు అత్యధిక అమౌంట్‌ను కోట్‌ చేశారు.

అయితే నిర్మాతలు ఆశిస్తున్న దానిలో సగం ధరకే ఓటీటీ సంస్థలు విశ్వంభర హక్కులు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఓటీటీ సంస్థలు ఇచ్చినా ఆఫర్‌ చూసి నిర్మాతలు మా సినిమాను ఇంత తక్కువకు అడగడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది. అయితే ఒకప్పుడు ఓటీటీ హక్కుల కోసం పోటీ పడిన సంస్థలు ఇప్పుడు కాస్త స్పీడును తగ్గిస్తూ.. ఓటీటీ రైట్స్‌ విషయంలో అచితూచి వెళ్లడమే అందుకు కారణమని తెలుస్తోంది..!

Advertisement

Next Story

Most Viewed