సెట్‌లో అతను నా కారవాన్‌కు వచ్చి షర్ట్ తీసేసి అలా చేశాడు.. కాజల్ ఆసక్తికర కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-05-21 08:18:31.0  )
సెట్‌లో అతను నా కారవాన్‌కు వచ్చి షర్ట్ తీసేసి అలా చేశాడు.. కాజల్ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ‘సత్యభామ’ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ప్రమోషన్స్‌లో భాగంగా టాలీవుడ్ చందమామ కాజల్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ప్రమోషన్స్‌లో భాగంగా పలు కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

అయితే తన లైఫ్‌లో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను చెప్పమని యాంకర్ అడగ్గా.. దానికి కాజల్ స్పందిస్తూ.. ‘‘నేను ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ నా కారవాన్‌లోకి సడెన్‌గా వచ్చి షర్ట్ తీసేశాడు. అతన్ని చూసి నేను చాలా భయపడిపోయాను. నాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పి దగ్గరకు వచ్చి అతని చాతీ పై ఉన్న నా పేరు టాటూ చూపించాడు. కానీ అలా సడెన్‌గా వచ్చేసరిగి నాకు కొంచెం కోపం వచ్చింది. దీంతో ఇలా బిహేవ్ చేయకండి అని గట్టిగా చెప్పాను. అది కరెక్ట్ కాదు కాబట్టి ఇంకోసారి అలా చేయొద్దని మందలించాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ కామెంట్స్ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed