ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌ది సపోర్టింగ్ రోల్.. విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-01-25 04:16:38.0  )
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌ది సపోర్టింగ్ రోల్.. విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, సినిమా: 2022లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినది. ఈ సినిమాకు పలు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి. అలాగే ఇందులో నటించిన నటీనటులు వరల్డ్ వైడ్‌గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టి రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ప్రశంసలు కురిపిస్తుంటారు. అప్పట్లో వీరిద్దరి నటనపై ఫ్యాన్స్ మధ్య వార్ కూడా జరిగింది. తాజాగా, ఆర్ఆర్ఆర్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రల్లో ఎక్కువకాలం గుర్తిండిపోయేది ఏది అంటే మీరు ఓపెన్‌గా చరణ్ అన్నారు అని యాంకర్ అడగ్గా.. దానికి విజయేంద్ర ప్రసాద్ అలాంటిదేమీ ఉండదు అన్నారు. యాంకర్ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న వేయడంతో.. తడబడుతూ పాత్ర రాసేటప్పుడు అలా ఏం అనుకోలేదు. అసలు ఒక పాత్రను తక్కువ చేయడం.. ఒక పాత్రను ఎక్కువ చేయడం అనేది మాకు ఉండదు.. అసలు అలా అనుకోం.. రాసేటప్పుడు మాకు రెండు పాత్రలు ఒకేలా అనిపించాయి.

ఒకేలా అనుకునే రాశాం.. రామ్ చరణ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉంటుంది.. ఎన్టీఆర్ పోషించిన పాత్ర చేయడం చాలా కష్టం.. కథను ముందుకు తీసుకెళ్లడంలో సపోర్టింగ్‌గా ఉంటుంది. రామ్ చరణ్‌ని అల్లురి సీతారామరాజుగా చూపిస్తే.. చాలామంది నార్త్ వాళ్లు రాముడు వచ్చాడని అనుకున్నారు. మేం ఆ ఉద్దేశంతో తీయలేదు’’ అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed