‘Nindu Noorella Saavasam Serial : అమర్‌ను హత్తుకున్న మనోహరి.. అరుంధతికి నిజం తెలిసిపోతుందా!

by Shiva |   ( Updated:2023-09-02 10:48:50.0  )
‘Nindu Noorella Saavasam Serial : అమర్‌ను హత్తుకున్న మనోహరి.. అరుంధతికి నిజం తెలిసిపోతుందా!
X

దిశ, సినిమా : రోజురోజుకు ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతున్న సీరియల్ ‘నిండు నూరేళ్ల సావాసం’. ఒక ఆర్మీ లెఫ్టినెంట్ కుటుంబ కథతో సాగుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అరుంధతి చనిపోవడంతో కథలో ట్విస్ట్ ఇచ్చిన ఈ సీరియల్ ఈరోజు(సెప్టెంబర్ 01) ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకుందాం..

కొడైకెనాల్ నుంచి సికింద్రాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని పిల్లలతో పాటు హైదరాబాద్‌లోనే ఉండేందుకు నిర్ణయించుకుంటాడు అమర్. లెఫ్టినెంట్‌గా కంటోన్మెంట్ లో బాధ్యతలను స్వీకరిస్తాడు. రాథోడ్ కూడా తన పిల్లల కోసం సికింద్రాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోతాడు. తల్లిలేని పిల్లలని వదిలి ఉండలేకే ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నానని అంటాడు రాథోడ్. అయితే, భాగమతి కంటోన్మెంట్‌కు వచ్చి కొత్తగా ఛార్జ్ తీసుకున్న లెఫ్టినెంట్ ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అనుకోకుండా అమర్‌నే లెఫ్టినెంట్ గురించి అడిగి గొడవపడుతుంది. అమర్ తుపాకీ ఎక్కుపెట్టడంతో అక్కడ నుంచి పారిపోతుంది. రాథోడ్‌ను కలిసిన భాగీ కొత్తగా వచ్చిన లెఫ్టినెంట్ అమరే అని తెలుసుకోలేకపోతుంది.

మేనేజర్ బతిమాలడంతో ప్రోగ్రామ్ చేస్తుంది భాగీ. అందుకు ప్రతిఫలంగా భాగీ అవసరానికి డబ్బులు ఇస్తాడు మేనేజర్. హాస్టల్‌కు వెళ్లిన భాగీ ఆలోచనలో పడుతుంది. ఏమైందని కరుణ అడగడంతో తన మనసులో బాధ పంచుకుంటుంది. చాలారోజుల తర్వాత ప్రోగ్రామ్ చేసినా ఎప్పుడూ ఫస్ట్ కాల్ చేసే భాగమతి కాల్ చేయలేదని, ఆమెకి ఎలా ఉందోనని కంగారు పడుతుంది. ఒకసారి అరుంధతికి కాల్ చేయమని చెబుతుంది కరుణ. సరేనన్న భాగీ కాల్ చేస్తుంది.

రూంలో చదువుకుంటున్న అరుంధతి పిల్లలు ఫోన్ మోగడంతో అది అరుంధతి ఫోన్ అని గుర్తిస్తారు. అంజలి ఫోన్ ఆన్సర్ చేసి మాట్లాడుతుంది. భాగమతి తన తల్లి గురించి అడగడంతో మాట్లాడలేకపోతుంది అంజలి. ఇంతలో అమర్ వచ్చి ఎవరని అడిగి ఫోన్ తీసుకుంటాడు. అమర్ గొంతు విన్న భాగమతి ఎక్కడో విన్నట్లుంది అంటుంది. అంతలోనే సిగ్నల్ పోయి కాల్ కట్ అవుతుంది. రెండు రోజులు ఆగి చేద్దువులే అని కరుణ నచ్చజెప్పడంతో సరేనంటుంది భాగీ.

అన్నం తినకుండా ఏడుస్తున్నట్లు నటిస్తుంది మనోహరి. తను ఏడుస్తున్నాని అమర్ దగ్గరకి వెళ్లి చెప్పమని పనిమనిషి నీలకి చెబుతుంది. విషయం తెలుసుకున్న అమర్ ఏమైందని మనోహరిని అడుగుతాడు. పిల్లల విషయంలో అమర్ తల్లి తనని కోప్పడిందని చెబుతూనే అమర్‌ను హత్తుకుంటుంది మనోహరి. పక్కనే ఉండి అంతా చూస్తున్న అరుంధతి షాకవుతుంది. మనోహరి ప్లాన్ అరుంధతికి అర్థమవుతుందా? తనని చంపింది మనోహరి అని అరుంధతికి తెలిసిపోతుందా? తెలియాలంటే ఈ రోజు, సెప్టెంబర్ 02న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!

Advertisement

Next Story