- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Niharika- Rajamouli: రాజమౌళిపై సంచలన కామెంట్స్ చేసిన నిహారిక కొణిదెల..!
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాతగా మారింది. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో పలు చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా హిట్ కాలేదు. దీంతో నిహారిక నిర్మాతగా మారినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ అమ్మడు మూడేళ్ల కిందట సిద్ధు జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరి బంధం మూన్నాళ్ల ముచ్చటగా మిలిగిపోయింది. దీంతో మెగా డాటర్ కెరీర్ పై ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఈమె కమిటీ కుర్రాళ్లు అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 9 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే నిహారిక పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెడుతూ వస్తోంది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ..
‘నా ఫ్యామిలీలో అందరూ నటన ఫీల్డ్‌లోనే ఉన్నారు కాబట్టి నాకు కూడా నటనపై ఇంట్రెస్ట్ కలిగింది. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నటిగా పలు మూవీల్లో నటించా కూడా. ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వస్తానని పెద్దనాన్నకు చెప్పాను. దీంతో ఆయన ప్రశంసలతో పాటు దారుణమైన ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తర్వాత ఆయన కెరీర్‌లో ఫేస్ చేసిన ఇబ్బందులను నాకు వివరంగా చెప్పారు. కొన్ని డేస్ తర్వాత నాకు ఒక మనసు మూవీలో నటించడానికి అవకాశం వచ్చింది.
ఓకే చెప్పాను. ఇక విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన లఘు సినిమాకు కథానాయికగా నన్ను అడిగారు. కానీ కొన్ని కారణాల వల్ల సాంగ్ వరకు మాత్రమే వర్క్ చేశాను. ఇకపోతే కార్తియేయ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా చేశాను. కానీ దాన్ని విడుదల చేయకపోవడమే బెటర్ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఇప్పుడు సినీ నిర్మాణం పై అవగాహన లేదు. కానీ అనుకోకుండా ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాను’. అంటూ మెగా డాటర్ నిహారిక చెప్పుకొచ్చింది.