- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బన్నీతో రొమాన్స్ చేసిన తప్పేంలేదు.. సీనియర్ హీరోయిన్‌పై హాట్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సిరివెన్నెల, శంభో శివ శంభో, యమదొంగ, జవాన్ రక్త చరిత్ర 2, క్షేత్రం, కల్పన-2 వంటి చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించి తనదైన సత్తాను చాటింది. ‘పరుత్తి వీరన్’ అనే చిత్రానికి ఏకంగా నేషనల్ అవార్డు దక్కించుకుంది.
ఇక అప్పటి నుంచి ఈ హీరోయిన్‌కు అటు తమిళంలో ఇటు తెలుగులో మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ మధ్యలో ప్రియమణి కొంచెం బరువు పెరగడంతో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. అలాగే పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఫొటోషూట్ విషయానికొస్తే.. ఈ వయసులో కూడా ప్రియమణి తరచూ హాట్ ఫొటోలకు ఫోజులిస్తూ.. సోషల్ మీడియాలోని జనాలందరినీ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఈ అమ్మడు చాలా స్మార్ట్‌గా మారింది. తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ టాప్‌లో దర్శనమిచ్చి కుర్రాళ్లను ఫిదా చేసింది.
గతంలో ఒక డాన్స్ షోలో ప్రియమణి.. ‘నాకు అల్లు అర్జున్ తో కలిసి నటించాలని ఉంది. అని చెప్పగానే ఐకాన్ స్టార్.. ఆశ వదులుకోకు.. నా పక్కన తప్పకుండా చేస్తావ్. బాగా సన్నగా అయ్యావ్. హాట్ గా కనిపిస్తున్నావ్’ అని బన్నీ ఫన్నీగా నవ్వుతూ అన్నారు. ఆ మాటలను గుర్తుచేసుకుని ఫ్యాన్స్.. ఇదేదో నిజమయ్యేలా ఉందే. ఇప్పుడు ప్రియమణి, అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసినా ఆశ్చర్యం లేదు? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.