నీకు అయింది పెళ్లి కాదు ఎంగేజ్మెంట్.. అప్పుడే హనీమూన్ వెళ్లావా..? హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-05 09:23:54.0  )
నీకు అయింది పెళ్లి కాదు ఎంగేజ్మెంట్.. అప్పుడే హనీమూన్ వెళ్లావా..? హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ వరలక్ష్మీ శరత్ కుమార్.. హీరో విశాల్‌కు బ్రేకప్ చెప్పేసి సింగిల్‌గానే ఉండిపోతుంది అనుకుని బాధపడ్డారు ఫ్యాన్స్. కానీ రీసెంట్ గా తనకు నచ్చినవాడితో ఎంగేజ్మెంట్ అంటూ అదిరిపోయే న్యూస్ చెప్పింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇక పెళ్లి బాజాలు త్వరలోనే మోగుతాయని తెలుస్తుండగా.. ఆ లోపే ఫియాన్సితో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

ప్రజెంట్ బ్యాంకాక్ లో గడుపుతున్న ఇద్దరు ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. షాపింగ్, వర్క్ అవుట్, లంచ్, డిన్నర్.. ఇలా అన్ని పిక్స్ పంచుకున్నారు. దీంతో అభిమానులు హ్యాపీ ఫర్ యూ వరలక్ష్మి అంటుంటే.. కొందరు మాత్రం అప్పుడే ఇలా తిరగడం ఏంటని తిట్టిపోస్తున్నారు. మీకు అయింది ఎంగేజ్మెంట్ మాత్రమే పెళ్లి కాదు.. అప్పుడే హనీమూన్ ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా చేతిలో డజను సినిమాలకు పైగా ఉన్న బ్యూటీ.. రీసెంట్‌గా ‘హనుమాన్’లో అక్క పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది.

Advertisement

Next Story

Most Viewed