సినిమాలకు దూరం అయ్యి భర్తతో పూజలు చేస్తున్న నయనతార.. ఆ గండం కారణంగానేనా!

by Kavitha |
సినిమాలకు దూరం అయ్యి భర్తతో పూజలు చేస్తున్న నయనతార.. ఆ గండం కారణంగానేనా!
X

దిశ, సినిమా: తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార అందరికీ సుపరిచితమే. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ సౌత్ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన క్రేజ్ ను పెంచుకుంటుంది.

ఈ బ్యూటీ తన ప్రియుడైన విగ్నేష్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసినదే. కాగా నయనతార విగ్నేష్, విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా కొన్ని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని అందరికీ క్లారిటీ వచ్చేలా నయనతార విఘ్నేష్ శివన్ లు ఇద్దరు తమ పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలతో పాటు ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. అయినప్పటికీ వీరి విడాకుల వార్తలు ఆగడం లేదు.

అయితే తాజాగా నయనతార విగ్నేష్ లు ఇద్దరు కలిసి ఓ గుడిలో పూజ చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఆ పూజలు ఎందుకు చేశారు అనే మ్యాటర్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే గత కొద్ది రోజులుగా నయనతార విగ్నేష్ శివన్ ల వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి.

అంతేకాకుండా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా వీరి వైవాహిక జీవితం బాగుండదని చెప్పడంతో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని భయపడి నయనతార విగ్నేష్ శివన్ లు ఇద్దరు ఎప్పటికీ అలాగే ఉండి ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి పూజ చేసినట్లు కోలీవుడ్లో ఒక ప్రచారం జరుగుతుంది.

Advertisement

Next Story