కలర్స్ స్వాతిపై నవీన్ చంద్ర కామెంట్స్‌.. స్టేజీపైనే ఏడ్చేసిన హీరోయిన్

by Hamsa |   ( Updated:2023-10-03 10:09:50.0  )
కలర్స్ స్వాతిపై నవీన్ చంద్ర కామెంట్స్‌.. స్టేజీపైనే ఏడ్చేసిన హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ప్రెస్‌మీట్‌లో స్వాతిపై నవీన్ చంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీంతో వెంటనే స్వాతి స్టేజీ మీదనే ఏడ్చేసింది. నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ ఈ సినిమాలో లేఖ అనే క్యారెక్టర్ చేయడానికి చాలా గడ్స్ కావాలి. మా సిస్టర్ జాబ్ చేస్తుంటారు. తాను బస్సు, ఆటో, మెట్రోలో రోజు ప్రయాణం చేయాలి. తన కుటుంబం కోసం కష్టపడాలి. అలాగే స్వాతి కూడా చాలా హార్డ్ వర్క్ పర్సన్. తనను నేను మా ఫ్యామిలీ మెంబర్‌గానే చూస్తాను. తను కష్టపడపడమే కాకుండా.. తనతో పనిచేసే వారిలో నమ్మకం కలిగిస్తుంది. ఆ దేవుడిని ఇంతకంటే ఏమి అడగలేను. అందుకే తను నా బెస్ట్ ఫ్రెండ్. భవిష్యత్తులోనూ ఏదైనా అవకాశమొస్తే మేమిద్దరం కలిసి నటిస్తాం. మేం మంచి నటులం. మీ అందరూ మా జోడీని ఇంత బాగా గుర్తిస్తున్నందుకు చాలా థ్యాంక్స్’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ మాటలు విన్న స్వాతి స్టేజ్‌పై ఏడ్చేసింది. అలాగే నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అని ఎమోషనల్ అయింది.

Read More: ‘కాంతార’ హీరోయిన్ సప్తమీ గౌడలో ఇంత విషయం ఉందా..?

Advertisement

Next Story