NANI 30 రిలీజ్ డేట్ ఫిక్స్..

by sudharani |   ( Updated:2023-04-16 13:02:08.0  )
NANI 30 రిలీజ్ డేట్ ఫిక్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి విజయం సాధించింది. అయితే.. ఇప్పుడిప్పుడే ‘దసరా’ సక్సెస్ మూడ్ నుంచి బయటకొస్తున్న నాని, అప్పుడే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టేశాడు. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రం అయిన ‘NANI30 నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చేశాడు.

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తున్న సినిమా ‘NANI30’. శౌర్యున్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్ అందించారు. ‘NANI30’ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21 న రిలీజ్ చేస్తున్నట్లు నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.


Also Read..

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘OG’ షూటింగ్ స్టార్ట్ (వీడియో)

Advertisement

Next Story