- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బ్రీత్’.. టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన నందమూరి కల్యాణ్ రామ్
దిశ, సినిమా: చైతన్య కృష్ణ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్న సినిమా కు ‘బ్రీత్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బసవతారక రామ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 1 గా నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న మూవీ టైటిల్ పోస్టర్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన కళ్యాణ్ రామ్.. ‘‘బ్రీత్’ టైటిల్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. టైటిల్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ అలరిస్తుందని కోరుకుంటున్నా.
టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పాడు. ఇక ఈ ఎమోషనల్ థ్రిల్లర్ అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని జయకృష్ణ చెప్పగా.. చిత్రంలో వైదిక సెంజలియా కథానాయికగా నటిస్తోంది. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. నందమూరి చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్, ఎస్ఆర్ఎస్ ప్రసాద్, అయిషా ని కీలక పాత్రలు పోషిస్తున్నారు.