Sitara-Namrata: సితారపై షాకింగ్ కామెంట్స్ చేసిన తల్లి నమ్రత శిరోద్కర్

by Anjali |
Sitara-Namrata: సితారపై షాకింగ్ కామెంట్స్ చేసిన తల్లి నమ్రత శిరోద్కర్
X

దిశ, సినిమా: ‘వంశీ’ చిత్రంతో ఒక్కటైన సూపర్ మహేష్ బాబు అండ్ నమ్రత శిరోద్కర్ ఎంతోమందికి ఆదర్శమైన జంటగా నిలుస్తారు. పెళ్లై 18 ఏళ్లు దాటుతోన్న ఎంతో అనోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. భర్త, అత్తమామ మాటల్ని జవదాటకుండా హిందూ సంప్రదాయాల్ని పాటిస్తూ మంచి కోడలిగా గుర్తింపు దక్కించుకుంది. వివాహనంతరం పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పి.. కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది. 2005 లో పెళ్లైన ఈ జంటకు ‘గౌతమ్, సితార’ జన్మించారు. పెళ్లాయ్యాక కూడా ఆఫర్లు వచ్చాయని, కానీ నేనే రిజెక్ట్ చేశానంటూ నమ్రత తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. భవిష్యుత్తులో కూడా నటించే ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ప్రిన్స్ మహేష్ బాబుకు వర్కింగ్ ఉమెన్‌గా ఇష్టం ఉండదని పేర్కొంది. కాగా సూపర్ స్టార్ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి హౌస్ వైఫ్‌గా ఉంటుంది నమ్రత. ఈ క్రమంలోనే గౌతమ్ ను ప్లాన్ చేసి జన్మనిచ్చామని.. కానీ సితారను తాము ప్లాన్ చేసి కనలేదని నమ్రత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed