- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా ఫ్యామిలీ కూడా నాకు పిచ్చిపట్టిందనుకున్నారు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ‘విజయ్ బిన్నీ’ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ సంక్రాంతికి రిలీజై.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ రోజు నుంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున మాస్ గెటప్‌లో కనిపించి.. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ కథానాయికగా నటించగా.. అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వీరు కూడా కారణమని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాను సంక్రాంతి పండగకు విడుదల చేస్తున్నట్లు చాలా ఆలస్యంగా కన్ఫర్మ్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాకు సపోర్ట్ గా ఉన్నారు. వారందరికీ కూడా చాలా చాలా థాంక్స్. మూవీ టీమ్ ను ప్రతి సెకన్ మిస్ అవుతున్నాను. మూవీ విడుదల టార్గెట్ తక్కువ టైమ్ ఉన్నప్పటికీ ఎవరూ ఒత్తిడి ఫీల్ అవ్వలేదు. చాలా యాక్టివ్ గా నవ్వుతూ పని చేశారు. నాన్నగారి బర్త్ డే నాడు.. సెప్టెంబర్ 20న ఈ సినిమాను లాంచ్ చేశాం. ఒకవైపు నాన్నగారి స్టాచ్యూ ఆవిష్కరణ జరుగుతోంది. అప్పటి వరకు ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తున్నట్లు నా కుటుంబానికి కూడా తెలియదు.
ఎక్కడికి వెళ్తున్నారని నన్ను అమల అడిగింది. సినిమా లాంచ్ ఉంది.. వెళ్లాలని తనతో చెప్పాను. ఇలా స్టాచ్యూ లాంచ్ జరుగుతోంది కదా లేట్ గా వెళ్లండని చెప్పుంది. కుదరదు నేను తొందరగా వెళ్లాలి. ఎందుకంటే నా సామిరంగ సినిమాను సంక్రాంతి పండగకే విడుదల చేయాలన్నాను. అప్పడు అమల.. పిల్లలు నాగ చైతన్య, అఖిల్ నాకు పిచ్చి లేసినట్లు చూశారు. నా మాటలు ఎవ్వరూ నమ్మలేదు. 3 నెలల సమయం కూడా లేదు ఎలా విడుదల చేస్తారని అందూ వింతగా చూశారు. కానీ నా టీం మాత్రం నమ్మింది. అనుకున్న టైంకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం. కీరవాణి కూడా ఒక టైం టేబుల్ వేసుకుని.. ఈ మూవీకి సంగీతాన్ని అందించారు’’. అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.