- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘Jailer’ మూవీపై Nagababu కామెంట్స్ వైరల్.. Rajinikanthను Chiranjeevi, Pawanతో పోల్చుతూ..
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘జైలర్’. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించగా నేడు ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించగా.. రమ్మకృష్ణ, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ యాక్టర్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాకుండా ఇందులో మెగా బ్రదర్ నాగబాబు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారట. అయితే ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ తమ ఓపీనియన్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా, మెగా బ్రదర్ నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘జైలర్’ మూవీపై ఆసక్తికర వీడియోను షేర్ చేశారు.
రజినీకాంత్ తో జైలర్ సినిమా షూట్ టైములో దిగిన ఫోటోలు, జైలర్ పోస్టర్స్ తో కలిపి వీడియో రూపంలో తన వాయిస్ ఓవర్ తో పోస్ట్ చేశారు. ‘‘ లక్షలాది మంది ఇతరుల లాగే నేను కూడా తలైవాకి అంకితమైన అభిమానిని. ఇప్పుడు ఒక్క సీన్‌లో కనిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది ఒక అందమైన జ్ఞాపకాన్ని సృష్టించింది. రేపు థియేటర్లలో మిమ్మల్ని చూడాలని ఎదురుచూస్తున్నాను. జైలర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పవన్ కల్యాణ్‌ను మా ఇంట్లో ఎలా ఇష్టపడతారో తలైవాను కూడా అలాగే ఇష్టపడతాము. ఆయన చాలా సున్నితత్వం కలిగినవారు. అన్ని వదిలేసి యోగి ఎలా ఉంటారో ఆయన అలాగే ఉంటారు. ఆయన ఆయురారోగ్యాలతో కలిగి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి, అమితా బచ్చన్, రజినీకాంత్‌లు అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఈ ముగ్గురు చాలా కష్టపడి పైకొచ్చిన వారు’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగబాబు పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read: సూపర్ స్టార్ ‘Jailer’ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే?