సినిమాలు చేయడం ఆపకపోతే చంపేస్తా.. నటికి తండ్రి బెదిరింపులు

by Dishaweb |   ( Updated:2023-07-08 12:57:51.0  )
సినిమాలు చేయడం ఆపకపోతే చంపేస్తా.. నటికి తండ్రి బెదిరింపులు
X

దిశ, సినిమా: ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అర్థనా బిను. ప్రజంట్ తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా అర్థనా బిను తన తండ్రి విజయ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ‘కొంతకాలం క్రితం మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి నేను నా చెల్లెలు అమ్మ కలిసి ఉంటున్నాం. విడాకులు తీసుకున్నప్పటికీ నా తండ్రి నన్ను, నా కుటుంబాన్ని బెదిరిస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నన్ను సినిమాలు ఆపేయాలని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఒకవేల నటించాలంటే ఆయన చెప్పిన సినిమాల్లో నటించాలన్నారు. నువ్వు అనుకున్నంత మంచిది కాదు, బతుకుదెరువు కోసం అమ్మమ్మ నిన్ను అమ్మేస్తుందంటున్నాడు. నేను షూటింగ్ పూర్తి చేసుకున్న నా మలయాళ సినిమా టీమ్‌తో కూడా అతను చెడుగా మాట్లాడాడు’ అంటూ అక్రమంగా తన తండ్రి ఇంట్లోకి ప్రవేశించిన వీడియోను షేర్ చేసింది. ప్రజంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed