నాకు అక్కాచెల్లెలు ఉన్నారు.. కాస్టింగ్ కౌచ్‌ ఇష్యూపై డైరెక్టర్

by sudharani |   ( Updated:2023-07-03 11:34:20.0  )
నాకు అక్కాచెల్లెలు ఉన్నారు.. కాస్టింగ్ కౌచ్‌ ఇష్యూపై డైరెక్టర్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ సమస్యపై డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా ఓపెన్ అయ్యాడు. ఈ మేరకు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన ఆయన.. ఎంతోమంది స్టార్ నటులు వెల్లడించిన తమ అనుభవాలు తనను కలిచివేశాయని చెప్పాడు. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పనిని ప్రారంభించకముందే కాస్టింగ్ కౌచ్ గురించి విన్నాను. నిజంగా ఈ సెక్స్‌వల్ హరాస్ ఇష్యూ నన్ను చాలా బాధపెట్టింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది. దాదాపు అందరూ గౌరవమైన కుటుంబంలోనుంచే వస్తారు. మా కుటుంబంలోనూ నాకు చాలామంది సోదరీమణులు ఉన్నారు. అందుకే మిగతా అమ్మాయిలను కూడా నేను సిస్టర్స్‌గానే భావించేవాడిని’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు.

Read More: బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్న ‘మామన్నన్’

Advertisement

Next Story

Most Viewed