- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంచన 4 లో మృణాల్ ఠాకూర్.. అవసరమా అంటున్న అభిమానులు!
దిశ, సినిమా: కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన హీరోగానే కాకుండా కొరియోగ్రాఫర్‌గా.. డైరెక్టర్‌గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. రాఘవ లారెన్స్ హీరో కమ్ డైరక్టర్‌గా 2011 లో తెరకెక్కిన సినిమా కాంచన. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ మూవీ. ఈ నేపథ్యంలోనే కాంచన 2, కాంచన 3 అంటూ మరొక రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేశాయి.
తాజాగా ఇప్పుడు ఈ సిరీస్ లో మరొక భాగాన్ని అనౌన్స్ చేశారు రాఘవ లారెన్స్. కాంచన 4 కూడా రాబోతోంది అని చిత్ర బృందం ఇప్పటికే ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసి మరీ ప్రకటించింది. ఈ సినిమాకి కూడా లారెన్స్ దర్శకత్వం వహించనుండగా చిత్ర షూటింగ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కాబోతుందని కూడా పోస్టర్ లోనే తెలిపారు. కాగా కాంచన 1,2,3 లలో లక్ష్మీ రాయ్, వేదిక, నిత్యా మీనన్, తాప్సీ పన్నులు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. దీంతో కాంచన 4లో ఎవరు హీరోయిన్‌గా నటిస్తారు అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజాగా కాంచన 4 లో రాఘవ లారెన్స్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈమె ఎంట్రీతో కాంచన 4 సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆమె అభిమానులు మాత్రం కెరియర్ మంచిగా వెళుతున్న సమయంలో లారెన్స్ పక్కన హీరోయిన్ గా అవసరమా అంటూ కంగారు పడుతున్నారు. మరి ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్ర ఎలా ఉండబోతుంది, సినిమాలో ఈమె పాత్ర తో ప్రేక్షకులను భయపెడుతుందా లేదా తెలియాలంటే సినిమా కోసం మరి కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.