- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టార్ హీరోతో మూవీ .. రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క..?
దిశ, సినిమా : ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా హీరోయిన్స్ కి క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అసలు సినిమాల్లో కనిపించక పోయినా ఈ బ్యూటీలు బాగా పాపులర్. అందులో హీరోయిన్ అనుష్క కూడా ఒకరు. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. తెరపై తన గ్లామర్ పాత్రలతో అదరగొట్టింది. అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో బాహుబలిలో తప్ప ఎక్కడా కనిపించలేదు.
బాహుబలితో పాన్-ఇండియా స్థాయిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారుతుందేమో అని అందరూ అనుకున్నారు. అనుష్క సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలను అందుకుంది. అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తుంది.
ఓ భారీ బడ్జెట్ మూవీలో.. స్టార్ హీరో సరసన అనుష్కను హీరోయిన్ గా ఎంపిక చేయగా , ఆమె నో చెప్పినట్టు సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదని.. అందుకే ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ మూవీకి రూ.5 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అయినా కూడా అనుష్క ఒప్పుకోలేదని సమాచారం.