మదర్స్ డే సందర్భంగా పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న హీరోయిన్

by Anjali |   ( Updated:2023-05-15 09:22:46.0  )
మదర్స్ డే సందర్భంగా పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘చెప్పవే చిరుగాలి’ చిత్రంలో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మలయాలీ హీరోయిన్ అభిరామి. విక్రమన్ దర్శకత్వంలో వేణు సరసన నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. 2009 లో రాహుల్ అనే వ్యక్తితో వివాహాం అయ్యాక పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన ఈ నటి మళ్లీ ఇప్పుడు దర్శనం ఇచ్చింది. కాగా.. పెళ్లి అయ్యి 14 ఏళ్లు పూర్తైన ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో ఆమె ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు నిన్న (మే14న) మదర్స్ డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ చిన్నారికి కల్కి అని పేరు కూడా పెట్టామని, ఇప్పుడు అమ్మ పాత్ర పోషిస్తున్నందుకు ఎంతగానో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే అందరి ఆశీస్సులు కావాలని పేర్కొన్నారు.

Read More: తొలిసారి కొడుకుని పరిచయం చేసిన హీరోయిన్..

కపిల్ శర్మ మూడేళ్ల కూతురి ర్యాంప్ వాక్.. క్యూట్ వీడియోకు నెట్టిల్లు ఫిదా

Advertisement

Next Story