కేవలం ఒక్కసారి వాక్ చేస్తే రూ. 100 కోట్లు? ఎక్కడ, ఎవరికో తెలుసా?

by Anjali |
కేవలం ఒక్కసారి వాక్ చేస్తే రూ. 100 కోట్లు? ఎక్కడ, ఎవరికో తెలుసా?
X

దిశ, సినిమా: ఈ యూఎస్.. డచ్.. పాలస్తీనియన్ మోడల్ జిగి హడిడ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. జిగి హాడిడ్ నికర విలువ సుమారు రూ. 30 మిలియన్ యూఎస్డీ. ఫ్యాషన్, మోడలింగ్ ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన మోడల్స్ లో జిగి ఒకరు. ఆమె సంవత్సరానికి 1 మిలియన్ వరకు సంపాదిస్తుందని టాక్.

2016 లో, ఆమె బ్రిటిష్ ఫ్యాషన్ కౌన్సిల్ ద్వారా ఇంటర్నేషనల్ మోడల్ ఆఫ్ ది ఇయర్‌గా సెలక్ట్ అయ్యింది. గెస్, టామ్ ఫోర్డ్, బాల్‌మైన్, మిస్సోని, మోస్చినో, ఇసాబెల్ మరాంట్‌లతో కలిసి జిగి వర్క్ చేసింది. ఆమె 2021లో $9 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. రీసెంట్‌గా జరిగిన మిలన్ ఫ్యాషన్ వీక్‌లో తన వెర్సాస్ క్యాట్ వ్యాక్‏తో జనాలందరినీ ఆశ్చర్యపరిచింది.

బటన్ డౌన్ డిటైలింగ్, బ్లాక్ షీర్ డ్రెస్‏లో కనిపించి ప్రేక్షకులను అబ్బురపరిచింది. జిగి హడిడ్‌కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పటికి ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. 28 ఏళ్ల ఈ యువతి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ఐకాన్‏గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడున్న ఫ్యాషన్ రంగంలో జిగి హడిడ్ టాప్ మోస్ట్ మోడల్. అయితే ఈమె మిలన్ ఫ్యాషన్ వీక్ లో క్యాట్ వాక్ చేసినందుకు వెర్సాస్ నుంచి దాదాపు 13 మిలియన్ యూఎస్డీ సంపాదించని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.

దీనిపై ఎలాంటి అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ లేనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది. బాబోయ్.. ఒక్కసారి నడిస్తే రూ.100 కోట్లు తీసుకుంటుందట. కేవలం కొన్ని నిమిషాలపాటు ర్యా్ంప్ వాక్ చేస్తే అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed