మెగాస్టారా మజాకా.. ఆ ఎనర్జీ ఏంట్రా బాబు.. ఫస్ట్ టైమ్ ఆ వీడియో విడుదల!

by Anjali |
మెగాస్టారా మజాకా.. ఆ ఎనర్జీ ఏంట్రా బాబు.. ఫస్ట్ టైమ్ ఆ వీడియో విడుదల!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ హీరో ‘గ్యాంగ్ లీడర్, అన్నయ్య, డాడీ, ముఠా మేస్త్రి, అన్నయ్య, ఖైదీ నెంబర్ 150, స్టాలిన్, ఇంద్ర, ఘరానా మొగుడు, జై చిరంజీవ, హనుమాన్, హిట్లర్, అల్లుడా మజాకా, అడవి దొంగ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ ముద్ర వేసుకున్నారు. ఈయన అద్భుతమైన నటనతో తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. మెగాస్టార్ ఫ్యాన్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో, మంచితనంతో మంచి గుర్తింపు దక్కించుకున్న మెగాస్టార్ తాజాగా జిమ్‌కు వెళ్లి.. చెమటలు చిందిస్తూ భారీ వర్కౌట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవ్వగా.. ‘మెగాస్టారా మజాకా.. ఆ ఎనర్జీ ఏంట్రా బాబు, రియల్ హీరో అంటే మెగాస్టార్’ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతూ చిరును ఆకాశనెత్తుతున్నారు. ప్రస్తతం మెగాస్టార్ చిరంజీవి జిమ్‌లో కష్టపడుతోన్న వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.


Advertisement

Next Story

Most Viewed