Varun Tej: ఎవరు ఊహించని స్టోరీతో రాబోతున్న మెగా ప్రిన్స్.. డైరెక్టరేవరంటే?

by Anjali |
Varun Tej: ఎవరు ఊహించని స్టోరీతో రాబోతున్న మెగా ప్రిన్స్.. డైరెక్టరేవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Mega Prince Varun Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరో ఇటీవలే మట్కా(Matka) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరుణ కుమార్(Karuna Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య నవంబరు 14 వ తేదీన విడుదల అయ్యింది. కానీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మట్కా సినిమా కోసం వరుణ్ తేజ్ బాగా కష్టపడ్డాడు. కానీ ఫలితం దక్కలేకపోయింది. కాగా ఈ హీరో తన నెక్ట్స్ మూవీ కోసం మంచి దర్శకుడితో చేయడానికి సిద్ధమవుతున్నాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.

మరీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్(Venkatadri Express), ఎక్స్‌ప్రెస్ రాజా(Express raja) వంటి సినిమాలను తెరకెక్కించిన మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi)తో జతకట్టబోన్నాడట మెగా హీరో. అలాగే సీరియస్ యాక్షన్ మూవీస్ కాకుండా కామెడీ మూవీస్ చేయాలని భావిస్తున్నాడట. నెక్ట్స్ వచ్చే మూవీ హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తుందట. ఈ చిత్ర షూటింగ్ 2025 మార్చిలో ప్రారంభమవ్వనుందని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్(UV Creations Banner) పై వరుణ్ తేజ్ తదుపరి చిత్రాన్నినిర్మించబోతున్నారని టాక్. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed