చాలా దారుణమైన పరిస్థితుల్లో మెగా హీరో.. ఇలా అయ్యిందేంటి?

by Jakkula Samataha |
చాలా దారుణమైన పరిస్థితుల్లో మెగా హీరో.. ఇలా అయ్యిందేంటి?
X

దిశ, సినిమా : ఒక స్టార్ హీరోగా మంచి ఫేమ్ సంపాదించుకోవడం అనేది అంత ఈజీగా కాదు. సపోర్ట్, హార్డ్ వర్క్, యాక్టింగ్ స్కిల్స్ ఉంటేనే ఎవరైనా సరే ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలుగుతారు. లేకపోతే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలానే ఓ హీరో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఏం తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాడంట. చేద్దాం అంటే ఆఫర్స్ లేక, చేసిన సినిమాలు హిట్ కాకపోవడంతో ఆయన క్రేజ్ మొత్తం తగ్గిందని, ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితిల్లో ఉన్నారంటున్నారు నెటిజన్స్. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా?

మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో అడుగు పెట్టిన ఈ హీరో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో అందరూ ఈ హీరోకు ఇత తిరుగే ఉండదు. వరస విజయాలతో దూసుకెళ్తాడు అనుకున్నారు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే అంతా రివర్స్ లా కనిపిస్తోంది. ఆయనకు ఒక ఆఫర్ కూడా రావడం లేదంట. దీంతో ఇండస్ట్రీలో ఉండటం కూడా నచ్చడం లేదు అని అంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆఫర్స్ లేకపోవడంతో ఆయన చిత్ర పరిశ్రమ నుంచి వెళ్ళిపోదాం అనుకున్న వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఒక వేళ దర్శకులను ఆఫర్స్ అడుగుదామా అంటే, ఆయన రేంజ్‌కు అడగటం బాగోదు, అహం.. పోనీ వారు ఏమైనా ఇస్తారా? అంటే అసలు వైష్ణవ్‌కు ఆఫర్ ఇచ్చే పొజిషన్‌లో ఏ డైరెక్టర్ లేడంట. దీంతో వైష్ణవ్ తేజ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైందంటూ ముచ్చటిస్తున్నారు నెటిజన్స్. కాగా, ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.

Advertisement

Next Story