బ్లాక్ బస్టర్ మూవీని దూరం పెడుతున్న ఓటీటీలు.. కారణం ఏమిటంటే?

by Jakkula Samataha |
బ్లాక్ బస్టర్ మూవీని దూరం పెడుతున్న ఓటీటీలు.. కారణం ఏమిటంటే?
X

దిశ, సినిమా : కరోనా నుంచి ఓటీటీ హవా కొనసాగుతోంది. వెబ్ సిరీస్, కొత్త కొత్త మూవీస్ అన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అంతే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా, మూవీస్ థియేటర్లలో రిలీజ్ కాకముందే,భారీ ధరకు ఒప్పందం కుదుర్చుకుని, తర్వాత స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇక సినీ ప్రేమికులు కూడా ఓటీటీవైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లలో రిలీజైన మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. దీంతో ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ త్వర త్వరగానే సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మాత్రం ఓటీటీకి దూరంగా ఉంది.

ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి ఏ ఓటీటీ కూడా ముందుకు రావడం లేదు. అయితే దీనికి కారణం ఉన్నదంట. అది ఏమిటంటే? ఈ సినిమాకు గరిష్ఠంగా అన్ని భాషలు కలిపి రూ.10.5 కోట్లు మాత్రం ఓటీటీలు ఆఫర్ చేశాయి. కానీ ప్రొడ్యూసర్లు మాత్రం మూవీ హిట్ అవడంతో రూ.20 కోట్ల వరకు డిమాండ్ చేయడంతో, ఓటీటీలు ఈ మూవీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీస్ ఓటీటీలో నెటిజన్స్ అంతగా ఆకట్టుకోవని, ఒక వేళ ముంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోతే నష్టపోతామేమో అనే భయంతో ఓటీటీలు సినిమాను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదని సమాచారం.

Advertisement

Next Story