హీరోయిన్లను మించిపోయిన మంచు మనోజ్ భార్య భంగిమలు

by Nagaya |   ( Updated:2023-06-22 12:37:09.0  )
హీరోయిన్లను మించిపోయిన మంచు మనోజ్ భార్య భంగిమలు
X

దిశ, వెబ్‌డెస్క్ : భూమ మౌనిక కాస్తా మంచు మౌనిక అయింది. రాజకీయ నేపథ్యం ఉన్న మౌనిక ఇటీవలనే హీరో మంచు మనోజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మౌనికకు గతంలోనే మ్యారేజ్ అయ్యి సంతానం కూడా కలిగింది. మనోజ్‌ సైతం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత వీరిద్దరు ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి రెండో వివాహం చేసుకున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. తాజాగా తన భార్య మౌనిక ఫొటోను మంచు మనోజ్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మౌనిక వేసిన ఏకపాద రాజకపోతాసనం ఫొటోను అభిమానులతో పంచుకున్నారు మంచు మనోజ్. అత్యంత క్లిష్టమైన ఈ ఆసనం ఎంతో సాధన చేసిన వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుందట. కానీ మంచు మౌనిక మాత్రం చాలా ఈజీగా వేసిందని మనోజ్ చెప్పుకొచ్చారు. అలాగే మౌనిక రోజు 108 సూర్య నమస్కారాలు చేస్తుందని వెల్లడించారు. ఆమె తల్లి శోభానాగిరెడ్డి దగ్గర నుంచి మౌనిక ఈ యోగసనం నేర్చుకుందని మనోజ్ తెలిపారు. కాగా, మౌనిక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మౌనిక హీరోయిన్లను మించిన భంగిమలు, ఫొజులు పెడుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read..

Keerthy Suresh :మెకానిక్‌తో కీర్తి సురేశ్ ప్రేమాయణం.. క్లోజ్‌గా దిగిన ఫొటోలు లీక్!

Advertisement

Next Story