‘మామా మశ్చీంద్ర’.. డీజే లుక్‌లో అట్రాక్ట్ చేస్తున్న సుధీర్ బాబు

by sudharani |   ( Updated:2023-03-08 14:21:28.0  )
‘మామా మశ్చీంద్ర’.. డీజే లుక్‌లో అట్రాక్ట్ చేస్తున్న సుధీర్ బాబు
X

దిశ, సినిమా: నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ తెరకెక్కించిన సినిమాలో సుధీర్ మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనుండగా తాజాగా మూడో సర్ ప్రైజ్‌తో వచ్చిన మేకర్స్ డీజే క్యారెక్టర్‌తో కూడిన హీరో నయా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో టీ షర్ట్, రిప్డ్ జీన్స్ ధరించి, హెడ్‌సెట్‌తో పూర్తిగా పారవశ్యంలో ముగినితేలుతున్న హీరో డీజేగా తన రిథమ్‌తో మనసుల్ని దోచుకునేలా కనిపిస్తున్నాడు. ఇక వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి : అభిమానులను అలరిస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్

Advertisement

Next Story