స్త్రీ శిల్పం రూపంలో అవార్డు ఇచ్చి టెంప్ట్ చేస్తున్నారు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు

by Prasanna |
స్త్రీ శిల్పం రూపంలో అవార్డు ఇచ్చి టెంప్ట్ చేస్తున్నారు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు
X

దిశ, సినిమా : కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రదానోత్సవంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నటుడు అలెన్సియర్ లే లోపెజ్. మాలీవుడ్ ఫిల్మ్ ‘అప్పన్’లో నటనకుగాను కేరళ గవర్నమెంట్ స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికైన ఆయన.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవార్డు రూపంలో స్త్రీ శిల్పాన్ని ఇచ్చి టెంప్ట్ చేయొద్దన్నాడు. ఒక బలమైన పురుష ముఖ్యమంత్రి ఉన్నప్పుడు.. ఫిమేల్ స్కల్ప్‌చర్‌తో ప్రలోభపెట్టడం సరికాదని, దీన్ని అవమానంగా భావిస్తున్నానని చెప్పాడు. పైగా అవార్డు బరువు ఉంది కానీ కేవలం రూ. 25వేలు ఇచ్చి నటులను అవమానపరుస్తున్నారని.. ఇప్పటికైనా బహుమతి రూపంలో ఇచ్చే మొత్తాన్ని పెంచాలని సూచించాడు. మేల్ స్కల్ప్‌చర్‌ అవార్డు అందుకున్న రోజున నటనకు స్వస్తి చెప్తానన్నాడు అలెన్సియర్.

ఇవి కూడా చదవండి : రూంలో గడియపెట్టి.. రేప్ చేశాడంటూ.. అతని గుట్టుని బయట పెట్టిన నటి



Next Story