- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి తర్వాత నా జీవితానికి అర్థం లేకుండా పోయింది: స్టార్ నటి
దిశ, సినిమా: సెక్సీ బ్యూటీ మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. యుక్త వయసులో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలనే కారణంగా అతన్ని పెళ్లి చేసుకున్నానన్న ఆమె.. తమ పర్సనల్ లైఫ్‌లో భిన్నమైన అంశాలు కోరుకోవడం వల్లే అతనితో విడిపోవాల్సి వచ్చిందని చెప్పింది.
'జీవితం ఎక్కడో గాడి తప్పినట్లు అనిపించింది. మరింత ముందుకెళ్లాలని కలలుగన్నా. దానికోసం కొన్ని బంధాలను వదిలించుకోకపోతే ఎదగలేనని గ్రహించా. దీంతో విడాకులు తీసుకోక తప్పలేదు' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల తనకు జరిగిన ప్రమాదం గురించి ఓపెన్ అయిన బ్యూటీ.. 'ప్రమాద సమయంలో నా కొడుకును చూడలేనేమో అనుకున్నా. కానీ, కొన్ని గంటల్లో స్పృహలోకి వచ్చాను. ఆపరేషన్ తర్వాత నా కళ్లు తెరిచేసరికి కనిపించిన మొదటి వ్యక్తి అర్బాజ్. దీంతో నా గతానికి తిరిగి వెళ్తున్నట్లు అనిపించింది. ఆ సమయంలో అర్బాజ్ నాతో ఉన్న తీరు నా మనసుని కదిలించింది. విడాకులు తీసుకున్న సమయంలోనూ మా కుమారుడు అర్హాన్‌ను బాగా చూసుకున్నాడు. అంతేకాదు నన్ను ఓ గొప్ప మనిషిగా మార్చాడు. తన వల్లే ఈ రోజు మెరుగైన స్థాయిలో ఉన్నా' అంటూ పొగిడేసింది.