వేణు స్వామితో పూజలు చేయించుకున్న మహేష్ బాబు.. వైరలవుతున్న ఫొటో..!!

by Hamsa |
వేణు స్వామితో పూజలు చేయించుకున్న మహేష్ బాబు.. వైరలవుతున్న ఫొటో..!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం సెలబ్రిటీల అందరి జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే కొంత మంది సెలబ్రిటీలు పూజలు, ప్రత్యేక హోమాలు కూడా చేయించుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

తాజాగా, మహేష్ బాబు, వేణు స్వామితో పూజలు చేయించుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఇప్పటిది కాదని తెలుస్తోంది. ఈ ఫోటో మహేష్ బాబు హీరోగా చేసిన రెండో సినిమా యువరాజు టైం లో తీసింది. ఇక యువరాజు సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వేణు స్వామిని మూవీ యూనిట్ తీసుకువచ్చారట. అలా పూజా కార్యక్రమాల సమయంలో తీసుకున్న ఫొటోనే అని అర్థమవుతోంది. కానీ ఈ ఫోటో చూసిన నెటిజన్లు మహేష్ బాబు కూడా వేణు స్వామితో పూజలు చేయించుకున్నారా అని ఆశ్చర్యపోతున్నారు.



Advertisement

Next Story