- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిరంజీవి గురించి మహేష్ బాబు నాకు ముందే చెప్పారు: అనిల్ సుంకర
దిశ, సినిమా: ‘ఏజెంట్’ మూవీతో భారీగా నష్టపోయిన నిర్మాత అనిల్ సుంకర.. ఇప్పుడు తన భారమంతా మెగాస్టార్ చిరంజీవి ‘బోళా శంకర్’ పైన వేసేసారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకానుంది. దీంతో మూవీ యూనిట్‌తో పాటు నిర్మాత అనిల్ సుంకర కూడా ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలు అందరినీ అశ్చర్యానికి గురిచేశాయి. ‘చిరంజీవితో ఇంత త్వరగా సినిమా చేస్తానని ఊహించలేదు. నా కల ఇప్పుడు నెరవేరింది. నేను ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికే చిరంజీవి రాజకీయాల్లో ఉన్నారు. అలాంటప్పుడు సినిమా అనే ఆలోచన రాదు. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వేడుక కోసం చిరంజీవిని ఆహ్వానించడానికి వెళ్లాం. అక్కడే తొలిసారి కలిశాం. చాలా సరదాగా మాట్లాడుతూ ‘మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నానండీ ఫైనల్‌గా కలిశాను’ అని చిరుతో అన్నాను.
అయితే ఆయన ‘కలవడం ఏంటండీ? మనం సినిమా చేస్తున్నాం’ అని అన్నారు. ఇక మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూట్ చేసేటప్పుడు నేను ప్రతిరోజు సెట్‌లో ఉండేవాని. నాకు, మహేష్‌కి మధ్య మంచి బాండింగ్ ఉంది. అయితే ‘భోళా శంకర్’ చేసేటప్పుడు ‘ఒక హీరోగా చెబుతున్నా.. ప్రతిరోజు మీరు సెట్‌లో ఉండాలి. నిర్మాత సెట్‌లో ఉంటే చిరంజీవి చాలా ఆనందపడతారు’ అని మహేష్ నాకు చెప్పారు. దీంతో 120 వర్కింగ్ డేస్‌లో దాదాపు 40 రోజులు చింజీవితో ఉన్నాను. అది నాకు చాలా మెమరబుల్ జర్నీ. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. ఒక్కరోజు కూడా వేస్ట్ కాలేదు. చాలా ఎంజాయ్ చేశాను’ అని చెప్పుకొచ్చాడు అనిల్.