Trending : ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు - ధోనీ.. వీరి ఫ్రెండ్ షిప్ చూసి పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. ఫొటోలు వైరల్

by Sujitha Rachapalli |
Trending : ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు - ధోనీ.. వీరి ఫ్రెండ్ షిప్ చూసి పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాజరైన ప్రముఖులలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కాగా ఫ్యామిలీతో కలిసి ఈ మ్యారేజ్ కు అటెండ్ అయ్యాడు ప్రిన్స్. ఆయన లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. ఇదిలా ఉంటే ఈ వివాహ మహోత్సవానికి ఎందరో సెలబ్రిటీస్ హాజరుకాగా.. వీరిలో ధోని కూడా ఉన్నాడు. తను కూడా కుటుంబంతో కలిసి విచ్చేసాడు. బారాత్ లోనూ డ్యాన్స్ లతో ఎంజాయ్ చేశాడు.


అయితే ఈ స్టార్ క్రికెటర్ ను పెళ్లిలో కలిసిన మహేష్ బాబు.. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. విత్ లెజెండ్ అనే క్యాప్షన్ తో పిక్స్ పంచుకున్నాడు. ఇక ఈ పిక్చర్స్ చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు ఫేవరేట్స్ ను చూసి మురిసిపోతున్నారు. వీరి కాంబినేషన్ లో ఒక్క సినిమా పడితే బాగుండు అని కోరుకుంటున్నారు. కాగా మహేష్ లుక్స్ కు సెపరేట్ ఫాలోయింగ్ ఉండగా.. క్రికెటర్లు ఆయనను చూసి మెస్మరైజ్ అయిన వీడియోలు కూడా ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి.


Advertisement

Next Story