- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్ శివారులో భూమి కొనుగోలు చేసిన మహేష్ బాబు?
దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. తన ఫ్యాన్స్‌ను కాస్త అసహనానికి గురి చేశాడు. ఈ సినిమా మహేష్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ప్రస్తుతం ఈ హీరో రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? ఈ నటడు భూమి కొనుగోలు చేశాడంట.హైదరాబాద్ శివార్లలోని 2.5 ఎకరాల భూమిని సూపర్ స్టార్ మహేష్ బాబు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. శంకర్ పల్లి సమీపంలోని గోపులారం పరిధిలో ఈ భూమిని కొన్నారు. రిజిస్ట్రేషన్ నిమిత్తం బుధవారం (మార్చి 6) శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ వెళ్లి, రిజిస్ట్రేషన్ పనులు ముగించకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అంతే కాకుండా మహేష్ బాబు కొనుగోలు చేసిన శంకర్ పల్లి పరిధిలోని రెండున్నర ఎకరాల భూమి నమ్రతా శిరోద్కర్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు సమాచారం. కాగా, ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.