ఇద్దరితో ప్రేమ.. నన్ను వాడుకొని వదిలేశాడు.. స్టార్ హీరోపై శిల్పా శెట్టి సంచలన కామెంట్స్..

by Kavitha |
ఇద్దరితో ప్రేమ.. నన్ను వాడుకొని వదిలేశాడు.. స్టార్ హీరోపై శిల్పా శెట్టి సంచలన కామెంట్స్..
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్. అగ్ర హీరోల సరసన సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ 49 ఏళ్లు. అయినా ఇప్పటికీ ఏమాత్రం తరగని అందాలతో ఆశ్చర్యపోయే ఫిట్నెస్ లుక్‏తో కనిపిస్తూ నెట్టింట సెన్సెషన్ అవుతుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా శెట్టి.. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం జిమ్ వర్కవుట్ వీడియోస్, లెటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. కాగా జూన్ 8న శిల్పా శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ బాలీవుడ్ బ్యూటీకి సినీ ప్రముఖులు, అభిమానుల బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే శిల్పా శెట్టికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. గతంలో శిల్పా శెట్టి చేసిన షాకింగ్స్ కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.

స్టార్ హీరో అక్షయ్ కుమార్‏, శిల్పా శెట్టి కలిసి ‘మై ఖిలాడీ తూ అనారి’ చిత్రంలో నటించారు. ఆ మూవీ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్లపాటు రిలేషన్ షిప్‏లో ఉన్న వీరిద్దరూ 2000లో మనస్పర్థలతో విడిపోయారు. ఆ మరుసటి ఏడాది 2001లో అక్షయ్ కుమార్ నటి ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నాడు. గతంలో బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్న శిల్పా శెట్టి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే అక్షయ్ కుమార్ తో తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. అక్షయ్ కుమార్ తనను లవ్ చేస్తున్నానని చెబుతూనే ట్వింకిల్ ఖాన్నాతో కూడా ప్రేమాయణం నడిపించాడని.. ఆ తర్వాత తనను వాడుకుని వదిలేశాడని తెలిపింది. మరో నటి కోసం తనను ప్రేమ పేరుతో మోసం చేసి వదిలేశాడని సంచలన ఆరోపణలు చేసింది. అప్పట్లో శిల్పా శెట్టి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలయ్యాయి. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను శిల్పా శెట్టి వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు.

Advertisement

Next Story