పరాయివాళ్ల పక్కలోకి పంపిన అమ్మ, అక్క..ఒంటరిని చేసి దోచేశారు.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి

by Sujitha Rachapalli |
పరాయివాళ్ల పక్కలోకి పంపిన అమ్మ, అక్క..ఒంటరిని చేసి దోచేశారు.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి
X

దిశ, సినిమా : నటి షకీలా 90లలో ఇండస్ట్రీని షేక్ చేసింది. తన సినిమా వచ్చిందంటే మలయాళ ఇండస్ట్రీ స్టార్ హీరోల మూవీస్ కూడా పక్కన పెట్టేసేవారు అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆమెను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే వారని, చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయని తెలుస్తుంది. అయితే షకీలా స్క్రీన్ పై అందాల ఆరబోతతో ఎంతో మందికి ఆనందాన్ని పంచినా.. ఆమె లైఫ్ మాత్రం అంధకారంలోనే ఉండేదని తాజాగా చెప్పుకొచ్చింది.

తను అలాంటి సినిమాలు చేయనని చెప్పినా సరే అమ్మ, అక్క బలవంతంగా ఆ ఇండస్ట్రీలోకి నెట్టేసారని చెప్పింది. చిన్నప్పుడే ఇలాంటి పనులు చేయించి డబ్బులన్నీ వాళ్లు తీసుకుని ఎంజాయ్ చేసారని, తనకు లైఫ్ లేకుండా అయిపోయిందని బాధపడింది. తన అక్క తను సంపాదించిన డబ్బులు తీసుకుని కోటీశ్వరురాలు అయిపోయిందని.. ఇలాంటి తోబుట్టువులు ఉండొద్దని ఏడ్చింది. ఆ టైంలో ట్రాన్స్ జెండర్స్ ను పెంచుకున్న తనకు వాళ్లే పిల్లలు అయిపోయారని.. నేను చనిపోతే కొరివి పెట్టేది వాళ్లే అని ఎమోషనల్ అయింది. కాగా షకీలా తెలుగు బిగ్ బాస్ చేశాక బిజీ అయిపోయినట్లు తెలిపింది. తమిళ్ లో ఓ షోకు యాంకర్ గా చేయడంతో పాటు పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చన్నని చెప్పింది.

Advertisement

Next Story