ఆమెకు ప్రపోజ్‌ చేసినట్లుగానే వరుణ్‌ నాకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.. లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్స్

by Anjali |
ఆమెకు ప్రపోజ్‌ చేసినట్లుగానే వరుణ్‌ నాకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.. లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సొట్టబుగ్గల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఓ వైపు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. మిస్టర్ సినిమాతో ఒక్కటైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్యల పెళ్లైనప్పటి నుంచి ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉన్నారు. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌ జాబితాలో వీరు కూడా పేరు దక్కించుకోవడం విశేషం.

అయితే లావణ్య త్రిపాఠి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై తనకు వరుణ్ ఏ రేంజ్‌లో లవ్ ప్రపోజ్ చేశాడో చెప్పుకొచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా.. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్‌’ సినిమాలో లావణ్య త్రిపాఠి, వరుణ్ సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వరుణ్-లావణ్య మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఈ మూవీ చివర్లో వరుణ్.. లావణ్యకు లవ్ ప్రపోజ్ చేశారట. అది కూడా తొలిప్రేమ చిత్రంలో రాశికన్నాకు ఎలా ప్రపోజ్ చేశాడో అలా చెప్పాడట వరుణ్ తేజ్.

ఈ హీరో కాలేజీ గ్రౌండ్‌లో ధైర్యంగా అందరిముందు రాశీకన్నాకు ప్రపోజ్ చేయడంతో.. మరో ఆలోచన లేకుండా.. హీరోయిన్ యాక్సెప్ట్ చేసింది. దీంతో వరుణ్.. లావణ్య విషయంలో కూడా ఇదే ఫాలో అయ్యాడట. తొలిప్రేమ సినిమా స్థాయిలోనే తన ప్రేమను వ్యక్తపరచడంతో లావణ్య.. వరుణ్‌కు ఓకే చెప్పిందంటూ సొట్టచెంపల బ్యూటీ వెల్లడించింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed