- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో నిహారిక టార్చర్ పెడుతోంది.. షాకింగ్ నిజం చెప్పిన లావణ్య త్రిపాఠి
దిశ, సినిమా: అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సొట్ట చెంపలు బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఈ హీరోయిన్ అందం, నటన, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. పెళ్లైన తర్వాత మొదటిసారిగా లావణ్య ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సిరీస్ ఫిబ్రవరి 2 వతేదీన డిస్నీ +హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
అయితే వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల సందర్భంగా.. లావణ్య త్రిపాఠిని మీడియా వారు పలు ప్రశ్నలు అడిగారు. లావణ్య ఆసక్తికర సమాధానాలతో అక్కడున్న వారందరికీ ఫిదా చేసింది. సినిమాలతో పాటు మెగా ఫ్యామిలీ గురించి కూడా క్వశ్చన్స్ ఎదురయ్యాయి. పెళ్లయ్యాక ఏమైనా కండిషన్స్ పెట్టారా? మెగా కోడలు అయినందుకు మీ ఫీలింగ్ ఏంటి? ఇలా పలు ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు లావణ్య నుంచి పాజిటివ్ సమాధానాలు రావడంతో ‘దటీస్ మెగా కోడలు’ అని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే నిహారికతో మీ బంధం ఎలా ఉంటుంది? అని ప్రశ్నించగా.. దానికి లావణ్య బదులిస్తూ..
‘నిహారిక నేను బెస్ట్ ఫ్రెండ్స్. మా పెళ్లికి ముందు నుంచే నేను నిహారికతో చాలా క్లోజ్ గా ఉండేదాన్ని. వివాహానంతరం కూడా నేను వరుణ్ కంటే ఆమెతోనే ఎక్కువగా గడుపుతాను. తను అంటే నాకు చాలా ఇష్టం. మనసులో ఏం దాచి పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. నాపై చాలా కేర్ తీసుకుంటుంది. ఇక అత్తయ్య-మామయ్య వాళ్లు నిహారికలాగే నన్ను చూసుకుంటారు. ఎలాంటి కండిషన్స్ పెట్టరు. నా జీవితం పెళ్లికి ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ నిహారిక.. ఇంట్లో ప్రతి విషయంలో నాకు పోటీ ఎక్కుగా ఉంటుంది. ఎందుకంటే జిమ్ లో ఆమె చెప్పిన వర్కౌట్స్ చేయలేక నేను టార్చర్ అనుభవిస్తున్నాను. ఈ కారణంగా కొద్ది రోజుల నుంచి నేను జిమ్ కు వెళ్లడం మానేశాను’’ అంటూ లావణ్య త్రిపాఠి.. నిహారికి గురించి ఫన్నీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ లొట్ట చెంపల సుందరీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.