Kriti Varma: మనీలాండరింగ్‌ కేసులో మరో నటి.. షాక్‌లో బాలీవుడ్!

by Prasanna |   ( Updated:2023-02-09 17:10:58.0  )
Kriti Varma: మనీలాండరింగ్‌ కేసులో మరో నటి.. షాక్‌లో బాలీవుడ్!
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ నటి కృతి వర్మకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో రూ.263 కోట్ల మోసాలకు పాల్పడిందనే ఆరోపణతో అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. 'బిగ్ బాస్ సీజన్ 12'లో మెరిసి సినీనటిగా మారిన మాజీ ఆదాయపు పన్నుశాఖ అధికారిణి కృతివర్మపై ఈ కేసు నమోదవడం ఇండస్ట్రీలో సంచలనం రేపింది. ఈ మేరకు ఆదాయపు పన్ను అధికారిగా ఉన్న సమయంలో తన సీనియర్‌ల లాగిన్‌లను ఉపయోగించి రూ.264 కోట్లమేర మోసాలకు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆరోపించింది. అలాగే ఇందులో ప్రముఖ వ్యాపారవేత్త భూషణ్ పాటిల్‌ను కీలక నిందితుడిగా గుర్తించారు. అక్రమ నిధులు పెద్ద మొత్తంలో పాటిల్ ఖాతాకు చేరాయని, ఇందులో కొంత భాగాన్ని వర్మ పేరు మీద ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు ఈడీ విచారణలో తేలింది. 12 మోసపూరిత టీడీఎస్‌ రీఫండ్‌ల కింద రూ. 263.95 కోట్లకు చేరాయని పీఎమ్‌ఎల్‌ఏ కింద జరిగిన ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో రూ.69.65 కోట్ల విలువైన 32 స్థిరాస్తులు, చరాస్తులను ఈడీ గత నెలలో అటాచ్ చేయగా.. భూషణ్ అనంత్ పాటిల్, రాజేష్ శెట్టి, సారిక శెట్టి, కృతి వర్మ తదితరుల పేరిట భూమి, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు ఉన్నట్లు స్పష్టం చేసింది.

Advertisement

Next Story