Prabhas and Kriti Sanon Marriage :ప్రభాస్‌నే పెళ్లి చేసుకుంటా.. కృతి

by Hamsa |   ( Updated:2022-11-26 12:20:10.0  )
Prabhas and Kriti Sanon Marriage :ప్రభాస్‌నే పెళ్లి చేసుకుంటా..  కృతి
X

దిశ, సినిమా : టాలీవుడ్ హీరో ప్రభాస్‌తో డేటింగ్ రూమర్స్‌పై బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌తో కలిసి 'ఆదిపురుష్'లో నటిస్తున్న ఆమె.. ప్రస్తుతం 'బేధియా' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటరాక్షన్‌లో ప్రభాస్‌తో డేటింగ్‌లో ఉన్నారా? ట్రైలర్ లాంచ్‌లో మీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటున్నారు? సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి? అనే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పింది. సినిమాకు ముందు ఎవరైనా ప్రజల దృష్టిని ఆకర్షించడం సహజమని, అందులో భాగంగానే తాము కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నట్లు తెలిపింది. అయితే ఇదే క్రమంలో 'నిజంగా నాకు అవకాశం వస్తే ఎప్పుడైనా ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను' అని చెప్పి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా డార్లింగ్‌తో కృతి డేటింగ్ రూమర్స్ నిజమవుతాయని ఆశిస్తున్నారు.

Read More: మహిళా కథలే రసవత్తరమైనవి.. ఆ కంటెంట్‌కే నా ప్రిఫరెన్స్ : లేడీ ప్రొడ్యూసర్

Advertisement

Next Story