Pawan Kalyan: పవన్‌పై కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అలాంటి వారని మరోసారి రుజువైందంటూ

by Hamsa |
Pawan Kalyan: పవన్‌పై కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అలాంటి వారని మరోసారి రుజువైందంటూ
X

దిశ, సినిమా: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. ఈ క్రమంలో.. ఆయనను కొందరు విమర్శిస్తుంటే.. మరికొంతమంది సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా, డైరెక్టర్ కృష్ణవంశీ పవన్‌పై వరుస ట్వీట్లు చేశారు. ఓ నెటిజన్ ..స్తుతం ఏపీలో జరుగుతున్న ఇష్యూపై మీరేమంటారు అని అడగ్గా కృష్ణవంశీ..‘‘మన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాకు ఎంతో ప్రేమ గౌరవం ఉన్నాయి. అవినీతి మయంగా మారిన రాజకీయాల్లో ఓ వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడు.

భగవంతుడు ఆయనకు ఎప్పుడూ అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిజం ఎప్పటికైనా నిజమే అవుతుంది. అది నిరూపించడానికి ఎవరి అంగీకారం అవసరం లేదు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ హీరో అని మరోసారి రుజువైంది. ఆయన లాంటి రాజకీయ నాయకులు ఎంతో మంది ప్రజల్లోకి రావాలి. యోగి ఆదిత్యానాథ్ తర్వాత అలాంటి విలువలు తెలివితేటలు కలిగిన ప్రత్యేక రాజకీయవేత్త పవన్. దేవుడు ఆయనకు ఎప్పుడూ తోడుగా ఉండాలనుకుంటున్నాను’’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్టులు చూసిన వారంతా పవన్‌కు యోగి ఆదిత్యానాథ్‌తో పోల్చకండి అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed