Kiran Abbavaram: పెళ్లికి ముందు ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కిరణ్ అబ్బవరం

by Hamsa |   ( Updated:2024-08-20 15:20:44.0  )
Kiran Abbavaram: పెళ్లికి ముందు ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కిరణ్ అబ్బవరం
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తొందరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఆయన మొదటి మూవీలో నటించిన హీరోయిన్ రహస్య గోరక్‌తో ప్రేమలో ఉన్న ఆయన.. మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు తామ 5 ఏళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే కిరణ్, రహస్య ఆగస్టు 22న పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికొస్తే.. ప్రజెంట్ ఆయన క పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, కిరణ్ అబ్బవరం ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. ‘‘ క మూవీ నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్‌కి చాలా మంది రెస్పాన్స్ వచ్చింది. నా పాటలన్నింటికీ ఎప్పుడూ మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్లు. కానీ ఈ సాంగ్ చాలా స్పెషల్. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ గారికి ధన్యవాదాలు. పాట రాసిన ఆయన నా ఫ్రెండ్ అన్ని షార్ట్ ఫిలిమ్స్‌కి నాతో పాటు ఉన్నాడు. అయితే నా మొదటి సినిమాలో రాజావారు రాణి గారు ఒకటవుతారని రాశారు. ఎల్లుండే నా పెళ్లి కూడా జరగబోతుంది (ఆగస్టు 22). మా డైరెక్టర్‌కు థాంక్యూ. కచ్చితంగా రాబోయే పాటలు కూడా చాలా బాగుంటాయి. కానీ వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ పాటనే చాలా స్పెషల్. ముందుగా మా టీమ్ విన్నాక నచ్చింది. ఈ పాట ఎంత విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.

Click Here For Twitter Post..


Read More..

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం పెళ్లి ముహూర్తం ఫిక్స్ .. ఎక్కడో తెలుసా..?

Advertisement

Next Story