Kiran Abbavaram: వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం, రహస్యల పెళ్లి ఫొటోలు.. ఎంత ముద్దుగా ఉన్నారో?

by Prasanna |   ( Updated:2024-08-29 14:07:02.0  )
Kiran Abbavaram: వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం, రహస్యల పెళ్లి ఫొటోలు.. ఎంత ముద్దుగా ఉన్నారో?
X

దిశ,వెబ్ డెస్క్: ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ కంటే ముందు రాజావారు రాణిగారు లో నటించాడు. అయితే, తన ఫస్ట్ మూవీ హీరోయిన్ నే పెళ్లి చేసుకున్నాడు. ఆ మూవీ వల్లే వీరి పరిచయం స్నేహంగా మారి ప్రేమ వరకు వెళ్ళింది. ఇలాగే ఐదేళ్లు లవ్ చేసుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి ఆగస్టు 22న అతి కొద్దీ సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

పెళ్లి వేడుక తర్వాత సొంతూరులో రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుక రాయచోటిలోని మామాడి తోటలో ఈ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. తాజాగా, దీనికి సంబందించిన ఫొటోలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు.

ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్స్, పెళ్లి ఫోటోలు ఇలా అన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం, ఇవి నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు 'రాజు వారు.. రాణిగారు జోడి సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story