- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వింటేజ్ నాగార్జున బ్యాక్.. కుబేర ఫస్ట్ లుక్ అదుర్స్.. శేఖర్ కమ్ముల అంటే మినిమమ్ ఉంటది మరి!
దిశ, సినిమా : ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏ సినిమా చేసినా దానికో స్పెషాలిటీ ఉంటుందనే టాక్ ఇప్పటికే ఉంది. తాజాగా ఆయన తెరకిక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేరా నుంచి ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో కుబేర అని టైటిల్ పెట్టి ధనుష్‌ను బిచ్చగాడి పాత్రలో చూపించారు. కింగ్ నాగార్జున మరో అదిరిపోయే లుక్‌తో దర్శనమివ్వగా, ఫస్ట్ లుక్‌తోనే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో శేఖర్ కమ్ముల మరోసారి డిఫరెంట్ స్టోరీతో ఏదో చేయబోతున్నారనే ఆసక్తి కలుగుతోంది.
ఫస్ట్ లుక్‌లో కింగ్ నాగార్జున స్టైల్ అయితే మరోసారి మమమ్మాస్ అనిపించింది. ఇక నాగ్ బ్లూ షర్ట్ ధరించి, కళ్లజోడు పెట్టుకొని, కూల్ లుక్స్‌తో మస్తు ఆకట్టుకున్నాడు. స్విచ్యువేషన్‌ని బట్టి చూస్తే నాగార్జున రిచెస్ట్ పొజిషన్‌లో రియల్ కుబేరుడిగా కనిపించాడు. పైగా నాగ్ ఈ సన్నివేశంలో వర్షం పడుతుండగా గొడుగు పట్టుకుని ఒక భారీ కంటైనర్ వద్ద ఉంటాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా రూ. 500 నోటు ఒకటి వర్షంలో తడిసి పాడైపోతుంది. దీంతో అతను తన జేబులోంచి ఒక రూ.500 నోటును తీసి కంటైనర్‌లో కలిపేస్తాడు.
ఇక నాగార్జున, ధనుష్ లుక్స్‌తోపాటు ఈ ఫస్ట్ లుక్ వీడియోలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన బీజీయం మరో లెవల్ అనే చెప్పాలి. నాగార్జున చురకత్తుల్లాంటి చల్లని చూపులకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరింత ఇంటెన్సిటీ పెంచేలా ఉంది. మొత్తానికి నాగార్జున ఫస్ట్ లుక్‌తో శేఖర్ కమ్ముల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాడు. అయితే ధనుష్, నాగార్జున పాత్రల మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? వీరిలో రియల్ కుబేరుడు ఎవరు? అనే సందేహాలకు సమాధానం దొరకాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే ఇక.