ట్రెండీ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చిన హీరోయిన్.. ఇంతందం కష్టం అంటున్న నెటిజన్లు!

by sudharani |   ( Updated:2024-03-19 13:28:43.0  )
ట్రెండీ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చిన హీరోయిన్.. ఇంతందం కష్టం అంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రజెంట్ వరుస పాన్ ఇండియా సినిమాలో దూసుకుపోతుంది. పెళ్లయ్యాక కూడా ఈ అందాల తారా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న ఈ అమ్మడు.. దీంతో పాటుగా.. ‘వార్ 2’, ‘డాన్ 3’ సినిమాల్లో కూడా హీరోయిన్‌గా ఎంపిక అయింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కియారా.. తన అందంతో, ట్రెండీ అవుట్ ఫిట్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా.. బ్లూ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది ఈ అమ్మడు. లైట్ బ్లూ కలర్ డ్రెస్‌లో కియారా ఔట్ స్టాడింగ్ లుక్స్‌కు అభిమానులు మెస్మరైజ్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘డ్రీమ్ గార్ల్’ అని.. ‘డిస్నీ ప్రిన్సెస్’ అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story