ప్లేట్ నిండా భోజనంతో కియారా అద్వానీ.. అమ్మ చేతివంట మీకూ కావాలా అంటూ..

by Prasanna |   ( Updated:2023-10-02 12:39:31.0  )
ప్లేట్ నిండా భోజనంతో కియారా అద్వానీ.. అమ్మ చేతివంట మీకూ కావాలా అంటూ..
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తనకు ఇష్టమైన ఫుడ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను నెట్టింట షేర్ చేసింది. రీసెంట్‌గా తన అలవాట్లు, అభిరుచుల గురించి ఫాలోవర్లతో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్న ఆమె.. ప్లేట్ నిండా భోజనం చూపిస్తూ అందులో ఉన్న వెజిటేబుల్స్ గురించి వివరించింది. ‘నా తల్లి జెనీవీవ్ అద్వానీ తయారుచేసిన సింధీ ఆహారాన్ని ఆస్వాదించండి. ఇంట్లో వండిన సింధీ కర్రీ, ఆలూ తుక్, బిండి ఫ్రై. ఇది చూస్తుంటే నిజంగా మీకు మామాస్ హోమ్ ఫుడ్ కావాలనిపిస్తోంది కదూ’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పప్పు అన్నంతో నిండిన ప్లేట్ ఫొటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’లో నటిస్తోంది కియార.

Advertisement

Next Story

Most Viewed