‘ఖుషి’ మూవీ సక్సెస్ కల నిజమయ్యిందంటూ.. సమంత ఎమోషనల్ పోస్ట్

by Hamsa |   ( Updated:2023-09-02 05:09:19.0  )
‘ఖుషి’ మూవీ సక్సెస్ కల నిజమయ్యిందంటూ.. సమంత ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంటగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కింది. (సెప్టెంబర్1 )ఖుషి సినిమా రిలీజ్ అయింది. ఈసినిమా సక్సెస్ సమంతకు చాలా ముఖ్యం. ఎందుకంటే.. వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తోంది. రీసెంట్ గా శాకుంతలం, అంతకు మందు యశోద, ఇలా ఫెయిల్యూర్స్ వస్తున్న క్రమంలో ఖుషి సినిమా సక్సెస్ కోసం ఆమె చాలా టెన్షన్ పడింది. మొత్తానికి ఖుషి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

తాజాగా, ఖుషి సినిమా రిజల్ట్‌పై సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్టు పెట్టింది. ‘‘ ఇది ఎప్పుడూ సులభం కాదు, జీవితాన్ని ఆసక్తికరంగా మార్చే నా కల నిజమయింది. ఖుషి కి ధన్యవాదాలు. చిత్రం 1- సినిమా విడుదలైన తర్వాత చిత్రం 2 3- ముందు (ఒత్తిడి) వీడియో 4- మీరు నన్ను జీవించి ఉన్న అదృష్టవంతురాలిగా చేశారు’’ అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అది చూసిన సామ్ ఫ్యాన్స్ నువ్వు సాధించావు అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే కొంత మంది ఎన్ని వచ్చినా ‘మజిలీ’ కిందకు రాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story