అక్కను ఫాలో అయిపోతున్న ఖుషీ కపూర్.. అతనితోనే డేటింగ్..

by Sujitha Rachapalli |
అక్కను ఫాలో అయిపోతున్న ఖుషీ కపూర్.. అతనితోనే డేటింగ్..
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతుళ్లు ఇద్దరు ఇప్పటికే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. జాన్వీ కపూర్ తనేంటో నిరూపించుకోగా.. ఖుషీ కపూర్ ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చింది. ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే జాన్వీ.. శిఖర్ పహారియను పెళ్లి చేసుకోబోతోందని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది. ఈ విషయంలో తండ్రి బోనీ కపూర్ కూడా సపోర్ట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఖుషి కూడా ప్రేమలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ' ది ఆర్చిస్ ' లో తనతో నటించన తోటి నటుడు వేదాంగ్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మూవీ రిలీజ్ టైం నుంచి వీరిద్దరు చాలా సార్లు జంటగా కనిపించడం ఇందుకు కారణం. కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ రాలేదు.

అయితే తాజాగా ఓ ఈవెంట్ లో కూడా వీరిద్దరు చేతిలో చేయి వేసుకుని కనిపించారు. మరో చోట ఖుషి.. వేదాంగ్ షర్ట్ సర్దుతున్న వీడియో హల్ చల్ చేస్తుంది. దీంతో రిలేషన్ పక్కా ఉందంటున్న నెటిజన్లు.. అక్క సెట్ చేసుకున్నట్లే తను కూడా ఆ ప్రయత్నంలోనే ఉందని అంటున్నారు. తండ్రికి ఇబ్బంది కలగకుండా వాళ్లే వరుడిని వెతుక్కుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed