కష్టపడితే స్టార్ హీరోయిన్ కాలేరు.. అదృష్టం ఉండాలంటున్న కేతికా శర్మ

by Prasanna |   ( Updated:2023-10-30 07:25:34.0  )
కష్టపడితే స్టార్ హీరోయిన్ కాలేరు.. అదృష్టం ఉండాలంటున్న కేతికా శర్మ
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే అదృష్టం ఉంటే చాలంటోంది యంగ్ బ్యూటీ కేతికా శర్మ. రీసెంట్‌గా ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నటి.. కెరీర్ అండ్ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే తన సక్సెస్‌ గురించి ఫాలోవర్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. ‘నేను పనిచేసే సినిమాలకు నా తరఫున ఫుల్‌ ఎఫర్ట్స్‌ పెడతాను. అది ఆడకపోతే నేను బాధ్యురాలినికాదు. నిజంగా నేను నటిగా ఫెయిల్‌ అయితే అప్పుడు నా బాధ్యత. సినిమాలకు అతీతంగా నాకు ఫ్యాన్‌ఫాలోయింగ్‌ ఉంది. అది చాలు. పనిచేసుకుంటూ పోవటమే నాకు తెలుసు. ఇక సక్సెస్‌ అనేది కాస్త లేటైనా ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తుంది. కాలం కలిసొస్తే చాలు వచ్చే అవకాశాలను కూడా ఎవరూ ఆపలేరు. అదృష్టం ఉంటేచాలు’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

Advertisement

Next Story