బ్రౌన్ కలర్ డ్రెస్‌లో ఖతర్నాక్ స్టిల్స్‌‌తో కీర్తీ సురేష్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

by Kavitha |
బ్రౌన్ కలర్ డ్రెస్‌లో ఖతర్నాక్ స్టిల్స్‌‌తో కీర్తీ సురేష్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను శైలజ’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత ‘మహానటి’ మూవీతో విమర్శకులను సైతం మెప్పించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోని అన్ని భాషలలో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ప్రస్తుతం కీర్తి బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఇంకా దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా కీర్తీ సురేష్ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకొని హాట్ స్టిల్స్‌తో ఉన్న పిక్స్ షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు ఓ సారి ఆ ఫోటోలపై ఓ లుక్ వేసేయండి.

Advertisement

Next Story