మత్స్యకారులతో టైమ్ స్పెండ్ చేయనున్న Keerthy Suresh.. ఎందుకంటే

by Hamsa |   ( Updated:2023-08-24 07:00:16.0  )
మత్స్యకారులతో టైమ్ స్పెండ్ చేయనున్న Keerthy Suresh.. ఎందుకంటే
X

దిశ, సినిమా: దర్శకుడు చందు మొండేటి అక్కినేని నాగచైతన్యతో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కాగా ఇందులో నాగ చైతన్యకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో వీరిద్దరు మత్స్యకారులుగా కనిపించనున్నారట. దీంతో మూవీటీమ్ ఇప్పటికే శ్రీకాకుళం వెళ్లి అక్కడి పరిస్థితులు పరిశీలిస్తోంది. చేపలు పట్టే వారి లైఫ్‌ స్టైల్ ఎలా ఉంటుంది? సముద్రంలోకి ఎలా వెళ్లి చేపలు పడతారు? అనే విషయాలు తెలుసుకుంటోంది. ఇక కీర్తి సురేష్ కూడా ఈ విషయాలు తెలుసుకోవడానికి త్వరలో శ్రీకాకుళం వెళ్లి, అక్కడి మత్స్యకారులతో వన్‌వీక్ స్పెండ్ చేయనున్నట్లు సమాచారం.

Read More: ‘Pushpa-2’ మూవీకి బన్నీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Advertisement

Next Story