చెతక్‌పై చక్కర్లు కొడుతున్న మహానటి.. నాని పక్కనే కూర్చొని

by sudharani |   ( Updated:2023-01-13 13:08:11.0  )
చెతక్‌పై చక్కర్లు కొడుతున్న మహానటి.. నాని పక్కనే కూర్చొని
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. నాని తొలిసారి పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యంలో నటిస్తున్న ఈ మూవీలో.. ఆయన ఊర మాస్ లుక్, టీజర్స్‌ ఇప్పటికే సినిమాపై భారీ అంచానాలు పెంచేశాయి. ఈ క్రమంలోనే తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మరో బ్యూటిఫుల్ ఫొటోతో నెట్టింట దర్శనమిచ్చింది కీర్తి. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా తమ పాత్రల గెటప్‌లో ఉన్న ఫొటోతో పాటు లేటెస్ట్ లుక్స్‌ కూడా షేర్ చేసిన ఆమె.. 'కొన్ని సినిమాలు మీ తలుపు తట్టి - 'హే, నేను మీ క్యాప్‌పై ఫెదర్‌గా ఉంటాను' అని చెప్తుంటాయి.

'దసరా' సినిమా నాకు అలాంటిదే' అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న మొదటి పిక్‌లో మాసిన జుట్టు, గుబురు గడ్డం, పాత దుస్తుల్లో ఉన్న నాని పక్కనే గడప దగ్గర కీర్తి అమాయకంగా కూర్చుని కనిపించగా.. రెండో ఫొటోలో మీసాలు తీసేసి చాల స్మార్ట్‌గా కనిపిస్తున్న హీరో పక్కన ఎల్లో కలర్ టాప్‌‌లో బ్యూటిఫుల్‌గా కనిపించింది. ఇక ఈ నయా లుక్స్‌పై తమదైన స్టైల్‌లో ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed